|
|
సూర్యపేట జిల్లా లో పరువు హత్య జరిగింది. మామిళ్ళ గడ్డకు చెందిన కృష్ణ ఆరునెలలక్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అదే ప్రాంతానికి చెందిన భార్గవిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహానికి అమ్మాయి సోదరుడు వ్యతిరేకించేవాడు. నిన్న సాయంత్రం మహేశ్ అనే వ్యక్తి నుంచి కృష్ణకు ఫోన్ వచ్చింది. ఫోన్ లో మాట్లాడిన కృష్ణ బయటకు వెళ్లి హత్యకు గురయ్యాడు. ఈ విషయాన్ని భార్గవి చెబుతోంది. ఈ హత్యలో తన అన్న పాత్ర ఉందని భార్గవి అనుమానిస్తోంది.